East Godavari |లోన్ యాప్స్ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలి

-

లోన్ యాప్(Loan App) నిర్వాహకులు రెచ్చిపోతూనే ఉన్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా వారి ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు వీరి వేధింపులు ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఈ వేధింపుల బారినపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తూర్పుగోదావరి(East Godavari) జిల్లాలోని కడియం గ్రామానికి చెందిన హరికృష్ణ(18) అనే యువకుడు ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తన వ్యక్తిగత అవసరాల కోసం కొన్ని యాప్స్ నుంచి లోన్ తీసుకున్నాడు. అనంతరం రూ.1.50లక్షలను యాప్‌లకు చెల్లించాడు.

- Advertisement -

East Godavari |అయినా సరే ఇంకా కట్టాలని వారి వేధింపులు ఎక్కువ అయ్యాయి. అసభ్య పదజాలంతో తిడుతూ, వాట్సాప్ సందేశాలు పంపుతూ దారుణంగా వేధించారు. దీంతో పోలీసులను ఆశ్రయించగా వేధింపులు త్కాలికంగా నిలిపివేశారు. మళ్లీ టార్చర్ పెడుతుండడంతో ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. హరికృష్ణ ఫోన్ పరిశీలించగా యువకుడి తల భాగంతో నగ్న చిత్రాలు, అసభ్య పదజాలంతో మెసేజ్‌లు ఉండటాన్ని కుటుంబసభ్యులు గమనించారు. తమ కుమారుడి మరణానికి కారణమైన లోన్ యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read Also: ఐపీఎల్‌లో యశస్వి జైశ్వాల్ సరికొత్త రికార్డు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Manmohan Singh | మన్మోహన్ సింగ్ వ్యక్తిగత, రాజకీయ ప్రస్థానం…

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) 1932 సెప్టెంబర్ 26న...

PM Modi | మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ ఎమోషనల్

కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై...