అమెరికా(America)లోని టెక్సాస్‌లో సైకో జరిపిన కాల్పుల్లో తెలంగాణ యువతి దుర్మరణం చెందారు. మృతురాలు తాటికొండ ఐశ్వర్యగా పోలీసులు గుర్తించారు. సైకోల కాల్పుల్లోనే ఐశ్వర్య మరణించినట్లు ఎఫ్‌బీఐ నిర్ధారించింది. ఐశ్వర్య రంగారెడ్డి జిల్లా జడ్జి నర్సిరెడ్డి కుమార్తె అని తెలిసింది. ఐశ్వర్య పర్ ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆదివారం టెక్సాస్‌లోని అలెన్ మాల్‌లో దండగులు జరిపిన కాల్పుల్లో మొత్తం 9 మంది చనిపోయారు. రంగారెడ్డి జిల్లా జడ్జి నర్సిరెడ్డి హైదరాబాద్ సరూర్‌నగర్‌లో ఉంటున్నారు. కుమార్తె మరణంతో నర్సిరెడ్డి కుటంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
- Advertisement -
Read Also: కేరళ బోటు ప్రమాదంలో తీవ్ర విషాదం.. 22కు పెరిగిన మృతుల సంఖ్య
Follow us on: Google News, Koo, Twitter