టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Telangana High Court issues key orders in Tollywood drugs case

0
110
Telangana

టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి పిల్ పై ఇవాళ హైకోర్టు విచారణ ముగించింది. డ్రగ్స్ కేసుపై 2017లో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సహకరించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది రచనరెడ్డి పేర్కొంది. కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్న కేసులో రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సరిగా లేదన్నారు. ఆన్ లైన్ విచారణలో నేరుగా కోర్టుకు ఈడీ జేడీ అభిషేక్ గోయెల్ వివరించారు.

డ్రగ్స్ కేసులో డాక్యుమెంట్లు, వివరాలను ప్రభుత్వం ఇవ్వడం లేదని పేర్కొంది ఈడీ.. ఎఫ్ఐఆర్ లు, ఇతర పూర్తి వివరాలు ఈడీకి అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు అధికారులు సమర్పించిన రికార్డులన్నీ ఈడీకి ఇవ్వాలని విచారణ కోర్టుకు ఆదేశించింది. ఈడీ దరఖాస్తు చేస్తే 15 రోజుల్లో వివరాలు ఇవ్వాలని విచారణ కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ కేసుకు సంబంధించిన వారి కాల్ డేటా రికార్డులను నెల రోజుల్లో ఈడీకి ఇవ్వాలని ఆదేశించింది.

సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలకు ఇవ్వాల్సిన అవసరం లేదన్న హైకోర్టు తమ ఆదేశాలను అమలు చేయకపోతే తీవ్రంగా పరిగణిస్తామని ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరించింది. వివరాలు సమర్పించకపోతే తమను సంప్రదించవచ్చునని ఈడీకి హైకోర్టు సూచించింది. మాదకద్రవ్యాలు యువతపై తీవ్రం ప్రభావం చూపుతున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించగా దేశ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈడీ దర్యాప్తునకు సహకరించాలంది.