Flash- అమెరికాలో తెలుగు వ్యక్తి దారుణ హత్య

Telugu man brutally murdered in America

0
76

అమెరికాలో ఓ తెలుగు వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ఆరెక్స్‌ లేబొరేటరీస్‌ అనే ఓ ఫార్మాస్యూటికల్‌ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్న శ్రీరంగ అరవపల్లి..న్యూజెర్సీలో నివసిస్తుంటారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన ఆయన. చాలా ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు. మంగళవారం తెల్లవారుజాము వరకుపెన్సిల్వేనియాలోని ఓ క్యాసినోలో గడిపిన శ్రీరంగ 3.30 గంటల సమయంలో అక్కడి నుంచి ఇంటికి బయలుదేరారు.

ఆరోజు క్యాసినోలో అదృష్టం ఆయన వైపు నిలవడంతో..దాదాపు రూ.8 లక్షలు సంపాదించారు. ఇది గమనించిన ఓ దుండగుడు.. అక్కడి నుంచే ఆయన్ను అనుసరించాడు. 80 కిలోమీటర్ల దూరం వరకు శ్రీరంగను వెంబడించిన దుండగుడు.. ఆయన ఇల్లు చేరగానే అతి సమీపం నుంచి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో శ్రీరంగ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

 

వెంటనే ఆయన దగ్గర ఉన్న సొమ్మును తీసుకుని దుండగుడు పరారయ్యాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు..వెంటనే రంగంలోకి దిగి దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఆరెక్స్‌ లేబొరేటరీస్‌‌కు హైదరాబాద్‌లో ఓ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ కూడా ఉంది. ఈ సంస్థతో పాటు ఈజ్‌మైండ్స్‌, ఈ పేరోల్‌ అనే మరో రెండు సంస్థలకూ సీఈవోగా శ్రీరంగ కొనసాగుతున్నారు. శ్రీరంగ అరవపల్లి మృతి పట్ల భారత రాయబార కార్యాలయం సంతాపం ప్రకటించింది.