Flash- తెలంగాణ ఇంటర్మీడియ‌ట్ బోర్డు కార్యాలయం వ‌ద్ద ఉద్రిక్తత

Tension at the Telangana Intermediate Board office

0
87

తెలంగాణ ఇంట‌ర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించడానికి ఏబీవీపీ కార్యకర్తలు ప్ర‌య‌త్నించారు.
ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలను నిరసిస్తూ బోర్డు కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు ప‌రిస్థితులు అదుపుత‌ప్ప‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నారు. దీంతో ఏబీవీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జ‌రిగి గంద‌ర‌గోళం నెల‌కొంది. ప్ర‌స్తుతం ఇంట‌ర్ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతోన్న విద్యార్థులు.. గ‌త ఏడాది రాయ‌లేక‌పోయిన ప్ర‌థ‌మ సంవ‌త్స‌ర ప‌రీక్ష‌లు రాశారు. క‌రోనా కార‌ణంగా వారు స‌రిగ్గా చ‌దువుకోలేక‌పోవ‌డంతో అధిక శాతం మంది ఉత్తీర్ణులు కాలేక‌పోయారు.