Flash: గిరిజనుల ప్రగతిభవన్​కు పాదయాత్రలో ఉద్రిక్తత

0
68

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గిరిజనులు తలపెట్టిన ప్రగతిభవన్​కు పాదయాత్ర కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. హైదరాబాద్​కు పాదయాత్రగా బయలుదేరిన వందలాది మంది గిరిజనులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులు ప్రతిఘటించటంతో ఘర్షణ వాతావణం నెలకొంది. ఈ క్రమంలో పలువురు మహిళలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.