Breaking: ఓయూలో టెన్షన్..టెన్షన్- పెట్రోల్ సీసాతో విద్యార్థి హల్​చల్

0
88

ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం పురస్కరించుకుని ఓయూలో క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు. టీఆర్​ఎస్వీ ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న ఈ టోర్నీని ప్రారంభించడానికి తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు ఈరోజు ఓయూకు వెళ్లనున్నారు.  అయితే ఓ విద్యార్థి..​ పెట్రోల్ సీసా​తో హల్​చల్​ చేశాడు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బలవన్మరణానికి ప్రయత్నించాడు. నోటిఫికేషన్లు ఇచ్చాకే తెరాస నేతలు ఓయూకు రావాలని అన్నాడు. లేకుంటే వారిని అడ్డుకుంటామని  స్పష్టం చేశారు.