Breaking: క్లాస్ రూమ్ లో ఘర్షణ..పదో తరగతి విద్యార్థి మృతి

Tenth class student killed in clash in classroom

0
80

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కృష్ణానగర్ లోని సాయి కృప స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు క్లాస్ రూంలోనే పేపర్ తో క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల మధ్య వివాదం నెలకొంది. వివాదం ముదరడంతో విద్యార్థులు ఘర్షణకు దిగారు. మంజూరు అనే విద్యార్థిపై మరో నలుగురు విద్యార్థులు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. దీనితో స్కూల్ యాజమాన్యం అతడిని హుటాహుటీన ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు.