ఫ్లాష్: ఘోర ప్రమాదం..ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం..

0
111

దేశంలో ఇప్పటికే రోడ్డు ప్రమాదాల కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలలో తీరని విషాదాన్ని మిగిల్చారు. తాజాగా మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరగడంతో ఓకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. కారు అదుపుతప్పి 60 అడుగుల లోతైన లోయలో పడిపోయిన విషాద ఘటన బీడ్​ జిల్లాలోని మసోబా వాడి ఫటా గ్రామానికి సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

కారులో ఐదుగురు ప్రయాణిస్తున్న క్రమంలో ఈ ఘటన జరగడంతో ముగ్గురు అన్నదమ్ములు, వారి మేనల్లుడు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యి పరిస్థితి విషమంగా ఉండడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.