ఘోర ప్రమాదం..బైక్ ను ఢీకొట్టిన టిప్పర్..యువకుడిని 20 మీటర్లు ఈడ్చుకెళ్లి..

Terrible accident in Hyderabad..the young man was dragged 20 meters ..

0
102

హైదరాబాద్ లో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూకట్​పల్లిలోని కేపీహెచ్​బీ కాలనీలో రోడ్ నంబర్ 1 వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడిని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీకొట్టిన తర్వాత అతన్ని ఆ టిప్పర్ దాదాపు 20 మీటర్ల మేర యువకుడిని ఈడ్చుకెళ్లింది. సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.