Flash: ఘోర ప్రమాదం.. ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 100 మంది దుర్మరణం

0
95
Kabul

ఆఫ్రికా దేశంలోని నైజీరియాలో ఉద్యోగాలు దొరక్క ప్రజలు అక్రమంగా చమురుశుద్ధి కేంద్రాలను  ఏర్పాటు చేసుకొని పని చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నైజీరియాలోని అక్రమ  చమురుశుద్ధి ఫ్యాక్టరీలో శుక్రవారం రాత్రి బారి పేలుడు సంభవించింది. ఈ ఘటనలో వందమంది పైగా గుర్తుపట్టలేనంతగా కాలిపోయి మరణించారు.

మరి కొంతమందికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇందులో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చనిపోయిన వారంతా అక్రమ ఆపరేటర్లేనని అధికారులు గుర్తించారు. నైజీరియాలోని రివర్స్, ఇమో స్టేట్ వద్ద ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. అందరు పనిచేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో ఉన్న సిబ్బంది తప్పించుకోలేక కొట్టుమిట్టాడారు.

కొంతమంది తప్పిచుకునే క్రమంలో చెట్టు కొమ్మలకు వేలాడుతూ కన్పించిన మృతదేహాలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. అవసరమైన జాగ్రతలు పాటించకపోవడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఆఫ్రికా దేశాల్లో ఇలాంటి అక్రమ చమురుశుద్ధి కర్మాగారాలు ఇంకా చాలానే కొనసాగుతున్నాయి.