Flash: ఘోర రోడ్డు ప్రమాదం.. చావులోనూ వీడని స్నేహబంధం

0
94

తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని నిజాంపేట్ వద్ద సలీం, నిఖిల్ అనే  ఇద్దరు ప్రాణ స్నేహితులను మృత్యువు కబళించింది. ఈరోజు ఉదయం ఇద్దరు కలిసి బైకుపై నిజాంపేట్ నుంచి పెద్దశంకరంపేట్ గ్రామానికి వెళుతుండగా..వెనక నుంచి అతివేగంగా వస్తున్న బోర్​ వెల్ బండి ఒక్కసారిగా ఢీ కొనడంతో నిఖిల్ అక్కడిక్కడే మృతి చెందాడు. సలీం అనే యువకుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీంతో ఇరు కుటుంబాలలో తీరని విషాదం నెలకొంది.