ఫ్లాష్: ఘోర రోడ్డు ప్రమాదం..దంప‌తులు, కుమార్తె స్పాట్ డెడ్

0
111

తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నిజామాబాద్‌ జిల్లాలోని కమ్మర్‌పల్లి సమీపంలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు బైకును ఢీకొనడంతో బైకుపై ఉన్న కృష్ణ, రజిత అనే దంపతులతో పాటు..కుమార్తె రాఘవి కూడా  అక్కడిక్కడే మృతిచెందడం జరిగింది.

ఈ ప్రమాదంతో దంపతుల చిన్న కుమార్తె  శరణ్య అనే బాలికకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు.అనంతరం పోలీసులు ప్రమాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.