Flash: ఘోర రోడ్డు ప్రమాదం..ఎనమిది మంది స్పాట్ డెడ్..ఈ ఘటనకు డ్రైవర్ నిద్రే కారణమా?

0
116

బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా బీహార్‌లోని పుర్నియా జిల్లాలో సోమ‌వారం తెల్ల‌వారుజామున జరిగిన ప్రమాదంలో భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వస్తుంది.పైపుల లోడ్‌తో వెళ్తున్న లారీలో అదుపుతప్పి ఒక్కసారిగా రోడ్డుపై బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న 8 మంది కూలీలు ప్రాణాలు కోల్పోగా, మ‌రో ఎనిమిది మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారించగా బాధితులంద‌రూ రాజ‌స్థాన్‌కు చెందిన వార‌ని, తేల్ల‌వారుజామున 3 గంట‌ల స‌మ‌యంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఈ ప్రమాదం జరిగిన అనంతరం లారీ డ్రైవ‌ర్, క్లీన‌ర్ ఘటనాస్థలం నుండి పరారవ్వడంతో డ్రైవర్ నిద్ర మత్తే  ఈ ప్రమాదానికి దారితీసిందని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని మెరునైనా వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.