ఏపీలోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పామిడిలోని 44వ జాతీయ రహదారిపై తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.