Flash: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. దైవ దర్శనానికి వెళ్ళి వస్తుండగా వెంటాడిన మృత్యువు

0
79

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం గూబగుండం వద్ద హైవేపై ఆదివారం రాత్రి ఒళ్ళు గాగుల్పొడిచే ప్రమాదం చోటుచేసుకుంది. వైఎస్ఆర్​ జిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు అందరు కలిసి మద్దిలేటి అయ్యా స్వామి పుణ్య క్షేత్రానికి వెళ్లి.. దర్శనం చేసుకున్న అనంతరం తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో..సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.