Flash: ఘోర రోడ్డు ప్రమాదం..లారీ కిందకు దూసుకెళ్లిన కారు..ఒకరు మృతి

0
108

తెలంగాణాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పటికే జరిగిన ఎన్నో రోడ్డు ప్రమాదాలలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోగా..తాజాగా  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపహాడ్‌లో జరిగిన ప్రమాదంలో భారీ ప్రాణనష్టం చవిచూడవలసి వస్తుంది.  ఆగి ఉన్న లారీని ఓ కారు దూసుకెళ్లిన ఘటన మండలంలోని సారపాక ఐటీసీ గేటు సమీపంలో జరిగింది.

అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారించగా ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఏకంగా ఏడుగురు ఉన్నారని పోలీసులు ప్రాధమికంగా నిర్దారించారు. భద్రాద్రి వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే  మరణించగా..మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు హుటాహుటిగా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.