Flash: ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు యువకుల దుర్మరణం

0
83

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సూర్యాపేట జిల్లా గుంజలూరు వద్ద  రోడ్డుపై నిలబడి ఉన్న ఇద్దరిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ప్రస్తుతం లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.