Flash News- ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు దుర్మరణం

Terrible road accident..Three fatalities

0
80

దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవర్ అజాగ్రత్తతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బుధవారం ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి చెందారు.

నెల్లూరు జిల్లా రుద్రకోట శివారులో కావలి జాతీయ రహదారిపై జరిగింది. స్థానికులు గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మార్గమధ్యలో సదరు వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.