జమ్మూ అండ్ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లా రాజౌరీ సెక్టార్లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. అందులో జూనియర్ కమిషన్డ్ అధికారి(జేసీఓ) ఉన్నారు. జిల్లాలోని పిర్ పంజాల్ పరిధి, సురాంకోట్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరగినట్లు జమ్ము రక్షణ విభాగం ప్రతినిధి తెలిపారు.
సూరంకోట్ అటవీ ప్రాంతానికి సమీపంలోని గ్రామంలో ముష్కరులు దాగి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి బలగాలు. ఈ క్రమంలో జవాన్లపై కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. ఇరువురి మధ్య భీకరపోరు జరిగింది. ఈ క్రమంలో జేసీఓ సహా నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
సరిహద్దుల్లోని ఛామ్రోర్ అటవీ ప్రాంతంలో భారీగా ఆయుధాలతో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని, నియంత్రణ రేఖ దాటేందుకు యత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.