తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని పురుషాంగం కోసేసుకున్న కొడుకు – ఇదేం దారుణం 

That parents are getting married they don't like

0
130
పెళ్లి విషయంలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన అభిప్రాయంతో ఉంటారు.  తల్లిదండ్రులు చూసిన సంబంధం కొందరు చేసుకుంటే, ప్రేమ పెళ్లి చేసుకోవాలి అని కొందరు అనుకుంటారు. ఇక మరికొందరు 20 ఏళ్లకే పెళ్లికి సిద్దం అవుతారు. మరికొందరు 30 దాటినా నో అంటారు. మరికొందరు లైఫ్ లో సెటిల్  అవ్వాలి అప్పుడే పెళ్లి అంటారు. ఇక తల్లి దండ్రులకి తమ అభిప్రాయం చెప్పి పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.
అయితే  చెన్నైలో ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు అందరినీ షాక్కు గురిచేసింది. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే కారణంతో ఓ యువకుడు  ఏకంగా  ఉలితో తన పురుషాంగం కట్ చేసుకున్నాడు. అసలు ఇలాంటి ఆలోచన కలలో కూడా ఎవరికి రాదు, కాని ఇంత దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు ఆ వ్యక్తి.
చెన్నైలోని గాంధీ నగర్కు చెందిన మురుగన్ కుమారుడు 23 ఏళ్ల విజయరాఘవన్కు పెళ్లి చేయాలని అతడి పేరెంట్స్ నిర్ణయించారు. 2 ఏళ్ల వరకూ పెళ్లి చేసుకోను అన్నాడు. కాని వినకుండా పేరెంట్స్  ఓ యువతితో వచ్చేవారం నిశ్చితార్థం ఏర్పాటు చేశారు.  తన మాట తల్లిదండ్రులు వినకపోవడంతో ఆ యువకుడు బలవంతంగా పెళ్లి చేస్తున్నారనే కోపంతో, ఉలితో పురుషాంగాన్ని కోసుకున్నాడు. వెంటనే పెరెంట్స్ అతనిని ఆస్పత్రికి తీసుకువెళ్లారు .ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.