ఇద్దరి ఇంటి పేర్లు ఒకటే అని పెళ్లికి పెద్దలు నో చెప్పారు – తర్వాత ఏమైందంటే

ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయారు

0
118

గుజరాత్లోని సావ్లి లోని డోడ్కా గ్రామంలో దారుణమైన ఘటన జరిగింది. 21 ఏండ్ల హరీష్ చావ్డా, సీమా చావ్డా ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఇక ఇద్దరూ దైర్యం చేసి తమ ప్రేమని ఇంట్లో వారితో చెప్పారు. ఇరువురి కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇద్దరి ఇంటి పేర్లు ఒకటి అవ్వడంతో ఈ పెళ్లికి నో చెప్పారు. అయితే అమ్మాయి కుటుంబ సభ్యులు వారం రోజుల్లో ఆమెకి మరో సంబంధం తీసుకువచ్చి ఎంగేజ్ మెంట్ చేశారు.

దీంతో తమ ప్రేమని పెద్దలు ఒప్పుకోవడం లేదని ఇద్దరు కలత చెందారు. ఇలా విడిపోయి ఉండలేమని ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయారు. రాత్రి అంతా వారి కోసం కుటుంబ సభ్యులు గాలించారు. వారి ఫోన్ నెంబర్లు పని చేయలేదు. దీంతో వారి జాడ తెలియలేదు . తర్వాత రోజు ఓ తోట దగ్గర చెట్టుకు వేలాడుతూ ఇద్దరూ కనిపించారు. కలిసి ఉండలేమని ఆత్మహత్య చేసుకున్నారు ఈ జంట.

ఆ రెండు కుటుంబాలు కన్నీరు మున్నీరు అయ్యాయి. ఇక ఇద్దరి ఇంటి పేర్లు ఒకటి కావడంతో ఈ పెళ్లి వద్దు అన్నాము. దాని కోసం ఇంత దారుణమైన నిర్ణయం తీసుకున్నారు అని ఇద్దరి పేరెంట్స్ పోలీసులకి తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.