ఎక్స్ ట్రాక్ట్ ఫ్యాన్ కోసం హోల్ పెట్టారు పాప తల ఇరుక్కుపోయింది -చివరకు ఏం చేశారంటే

The baby's head got stuck in the hole made for the extract fan

0
86

ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్ జాగ్రత్తగా చూస్తు ఉండాలి. లేదంటే అది పెను ప్రమాదాలకు కూడా కారణం అవుతుంది. చైనాలో ఇలాగే చిన్న నిర్లక్ష్యం కాస్త ఓ పసిపాప ప్రాణం పోయేంత ప్రమాదానికి దారితీసింది. ఇంటిలో ఆ తండ్రి ఫ్యాన్ బిగించడానికి వెళ్లాడు. కాని అక్కడ ఓ తల వేలాడుతూ రక్షించండి అని పిలుపు వినిపించింది . వెంటనే పైకి వెళ్లి చూశాడు ఇంతకీ ఎవరు అంటే అతని కూతురు అక్కడ ఇరుక్కుపోయింది.

ఇంతకీ ఏం జరిగింది అంటే ? చైనా దేశంలో గుయిజోకు చెందిన పుడ్డింగ్ కౌంటీలో ఎక్స్ట్రాక్ట్ ఫ్యాన్ బిగించడం కోసం ఓ రంద్రం చేశారు. కాని అతని కూతురు మాత్రం ఆ రంద్రం ఏమిటో తెలియక దాని లోంచి కిందకు తొంగి చూడటానికి ప్రయత్నించింది.
ఆ చిన్నారి తల ఆ కన్నంలో ఇరుక్కుపోయింది.

ఆ పాపను తీయడానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేదు. దీంతో ఏదైనా ఇంజూరి అవుతుందని పోలీసులకి ఫైర్ సర్వీస్ కి తెలిపాడు. వారు వచ్చి అక్కడ మరో రంధ్రం చేసి ఆమెని జాగ్రత్తగా బయటకు తీద్దాం అనుకున్నారు. కాని అవ్వలేదు కొంచెం వంట నూనె ఆ హోల్ చుట్టూ పోసి ఆమె తలను బయటకు తీశారు. ఆమె సేఫ్ గానే ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

https://www.youtube.com/watch?v=PGPVUscbcIc