Flash: పండుగ పూట పెను విషాదం

0
102

తెలంగాణలో ఉగాది పండుగ పూట విషాదం నెలకొంది. నాగర్ కర్నూల్ జిల్లా తుర్కలపల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నేరేడుచర్లకు చెందిన ఐదుగురు కడప నుంచి వస్తుండగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న సిమెంట్ దిమ్మెను బలంగా ఢీకొంది. ఏ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా..ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.