Breaking- వాటర్ ట్యాంక్‌లో మృతదేహం కలకలం..ఉలిక్కిపడ్డ స్థానికులు

The body was found in a water tank

0
101

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో గుర్తు తెలియని మృతదేహం కలకలం సృష్టించింది. ముషీరాబాద్ హరి నగర్ రీసాల గడ్డ వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేయడానికి వచ్చిన వాటర్ వర్క్స్ సిబ్బంది మృతదేహాన్ని చూసి వాటర్ వర్క్స్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటన స్థలానికి చేరుకున్న ముషీరాబాద్ సిఐ జహంగీర్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ రవి చారి వాటర్ వర్క్స్ ఇన్ స్పెక్టర్ ట్యాంక్ పై ఉన్న చెప్పులు మృతునికి సంబంధించినవిగా అనుమానిస్తున్నారు. మృతుని వయసు 35 నుండి 40 సంవత్సరాలు ఉండవచ్చని తెలుస్తుంది. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉన్నట్లు సమాచారం. మృతదేహాన్ని వెలికితీయడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. వాటర్ ట్యాంక్‌లో మృతదేహం బయటపడడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.