Breaking News- హైదరాబాద్ లో మృతదేహం కలకలం..అసలేం జరిగింది?

The body was found in KBR Park

0
80

హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్క్ లో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు. మృతుని వివరాలు ఇంకా తెలియలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.