యజమాని ఓ అమ్మాయితో ఆఫీస్ లో అఫైర్ – ఉద్యోగులు ఏం చేశారంటే

The boss had an affair with a girl in the office

0
99

యూపీ పరిధిలోని ఘజియాబాద్లో హిండన్ విహార్ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీ యజమాని ఉంటున్నాడు. అక్కడ పనిచేసే మహిళతో సన్నిహితంగా ఓ రోజు ఉద్యోగులకి కనిపించాడు. ఉద్యోగులు లేని సమయంలో ఆమెతో చనువుగా ఉండేవాడు. వీరిద్దరి మధ్య అఫైర్ ఉందని ఉద్యోగులకి తెలిసింది. మొత్తానికి అతని క్యాబిన్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వారిద్దరి రాసలీలలు వీడియోలు రికార్డ్ చేశారు.

ఇక ఇటీవల ఆ యజమానికి ఈ వీడియో క్లిప్పులు పంపించి అతన్ని ముగ్గురు ఉద్యోగులు బెదిరించారు. మాకు 25 లక్షలు ఇవ్వకపోతే ఈ క్లిప్స్ బయటపెడతాం అని బెదిరించారు. దీంతో ఆ యజమాని షాక్ అయి మీకు10 లక్షలు ఇస్తాను అని బేరం మాట్లాడాడు. చివరకు ఈ విషయం పోలీసులకు చెప్పి వారిని పట్టుకున్నాడు.

పది లక్షలు తీసుకుని ఓ చోటుకి వెళ్లాడు. అక్కడకు ఈ ముగ్గురు వచ్చారు. దీంతో వారు తమ ఉద్యోగులు అని తేలింది. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల విచారణలో తమతో ఉద్యోగం చేయించుకుని జీతం ఇవ్వడం లేదు. అందుకే ఇలాంటి పని చేశాం అని ఉద్యోగులు తెలిపారు.అపర్ణ త్యాగి, అంకిత్, అరుణ్ ఘోష్లుని పోలీసులు అరెస్ట్ చేశారు.