Flash: షాకింగ్..ఫోన్ రీఛార్జ్ చేయలేదని సూసైడ్ చేసుకున్న బాలుడు..

0
91

ప్రస్తుత కాలంలో చిన్నాపెద్దా అని తేడా అందరు ఫోన్ కు అలవాటు పడిపోతున్నారు. అయితే తాజాగా మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ జిల్లాలో ఫోన్ కు బానిసై తన ప్రాణాన్ని తానే బలితీసుకోవడానికి కూడా వెనకాడలేదు. అసలేం జరిగిందంటే..జబల్ పూర్ చెందిన నిఖిల్ అనే 14 ఏళ్ళ కుర్రాడు రోజంతా ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ ఉండేవాడు.

అనారోగ్యం కారణంగా తల్లి చనిపోవడంతో..తండ్రి కష్టపడి తన కుమారుడిని పోషించుకుంటున్న క్రమంలో నిఖిల్ ఫోన్ లో బాలన్స్ అయిపోయాయి. దాంతో తండ్రిని రీఛార్జ్ చేయమన్నాడు. డబ్బులు లేకపోవడంతో నిఖిల్ తండ్రి రీఛార్జ్ చేయించలేదు. దాంతో మూడు రోజుల పాటు ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో తోచక డిప్రెషన్ కు గురయ్యి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. దాంతో భార్య, కొడుకు మరణించడంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరు చేసుకున్నాడు.