పెళ్లి అయిన రెండు రోజుల‌కే అత్త‌గారింటి నుంచి పారిపోయిన వ‌ధువు

The bride who ran away from her mother-in-law just two days after the wedding in bihar

0
116

ఈ రోజుల్లో కొన్ని పెళ్లిళ్లు చూస్తుంటే ఇష్టం లేని పెళ్లి చేశార‌ని, ఏకంగా భ‌ర్త‌ని వ‌దిలేసి ప్రియుడితో పారిపోతున్న వారిని చూస్తున్నాం. లేదా పెళ్లి పీట‌ల‌పై నుంచి త‌న‌కు ఈ పెళ్లి ఇష్టం లేద‌ని చెబుతున్న అమ్మాయిల‌ని చూస్తున్నాం. అయితే త‌న‌కు ఇష్టం లేని పెళ్లి చేశార‌ని, వివాహం అయిన రెండు రోజుల‌కే త‌న భ‌ర్త‌ని వ‌దిలేసి ప్రియుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయింది ఈ న‌వ వ‌ధువు.

బీహ‌ర్ కు చెందిన అను, అషు ఇద్ద‌రూ రెండు సంవ‌త్స‌రాలుగా ప్రేమించుకున్నారు. అయితే అను త‌ల్లిదండ్రులు ఈ పెళ్లికి నో చెప్పారు. వేరే అబ్బాయితో ఇటీవ‌ల పెళ్లి చేశారు. కాని ఆమె అత్త‌వారి ఇంటి నుంచి రెండో రోజు పారిపోయింది. ప్రియుడి ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయింది.

వీరిద్ద‌రూ బెంగ‌ళూరు వెళ్లే రైలు ఎక్కి పారిపోయి అక్క‌డ వివాహం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న రెండు నెల‌ల క్రితం జ‌రిగింది. అయితే తాజాగా వారిని ఇంటికి తీసుకువ‌చ్చార‌ట‌. ఈ ఘ‌ట‌న‌తో పెళ్లి కొడుకు చాలా విచారంలో ఉన్నాడు.