కాసేపట్లో పెళ్లి..వరుడ్ని చితకబాదిన పెళ్లికూతురు కుటుంబీకులు..ఎందుకో తెలుసా?

The bride's family crushed the groom for a while

0
103

మరికాసేపట్లో పెళ్లి అనగా రూ.10 లక్షలు కట్నం డిమాండ్​ చేశారు వరుడి కుటుంబీకులు. వధువు తరపు వారి నుంచి డబ్బులు వస్తాయి అనుకుంటే సీన్​ రివర్స్ అయింది. అమ్మాయి తరపు బంధువులు, అతిథులు వరుడిపై దాడికి దిగారు.

అందరూ కలిసి చితకబాదారు​. కానీ అది కట్నం అడిగినందుకు కాదు. వరుడికి ఇదివరకే చాలా పెళ్లిళ్లు అయ్యాయని తెలియడం వల్ల. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్​మీడియాలో వైరల్ అయింది. సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

హుసైన్​ పెళ్లి వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన అతడి తండ్రిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబసభ్యులు మరో యువతిని వివాహం చేసుకున్నట్లుగా ఉన్న హుసైన్​ పెళ్లి ఫొటోను పోలీసులకు అందించారు.