Flash: కలకలం..ఇద్దరు చిన్నారుల దారుణ హత్య

The brutal murder of two children

0
131

ఝార్ఖండ్​లోని పాకుడ్​ జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు చిన్నారులను అత్యంత క్రూరంగా హత్య చేసిన దుండగులు అతి కిరాతకంగా వ్యవహరించి చెరో కన్నును తొలగించారు.  గ్రామం సమీపంలోని పంట పొలాల్లో ఓ బాలుడు, బాలిక మృతదేహాలు లభించాయి. వారి చెరో కన్నును తొలగించారు. బాలికకు 12, బాలుడికి 10 ఏళ్ల వయసు ఉంటుంది. వ్యక్తిగత కక్షలు సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాం. బాధితుల బంధువు ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. మృతుల తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం అని హ్రుదీప్​ పీ జనార్ధన్​, జిల్లా ఎస్పీ తెలిపారు.