ఈ రైతులు చేసిన ప‌నికి గేదెలు మందుకొట్టాయ్ – చివ‌ర‌కు ఏం జ‌రిగిందంటే

The buffaloes were drinked liquor for the work done by these farmers

0
106

టైటిల్ విని మీరు షాక్ అయ్యారా ? ఇదేమిటి గేదెలు మందు తాగ‌డం అని ఆశ్చ‌ర్యం క‌లిగిందా. ఇక్క‌డ రైతులు చేసిన త‌ప్పుకి పాపం అవి తెలియ‌క ఈ త‌ప్పు చేశాయి. గుజ‌రాత్ లో అక్రమ మద్యం అమ్మకంగానీ, తాగడం గానీ, రవాణా చేయడంగానీ నిషేదం. అయితే అహ్మదాబాద్ లో ముగ్గురు రైతులు సారా వంటి మద్యాన్ని సంపాదించారు.

ఇవి ఇంట్లో పెడితే దొరికిపోతామ‌ని భ‌య‌ప‌డి పొలాల్లో కాలువ‌ల ద‌గ్గ‌ర దాశారు. ఇక అప్పుడప్పుడూ వీటిని తీసుకుని తాగేవారు. కొన్ని అమ్మేవారు. అయితే అక్క‌డ దాచిన కొన్ని బాటిల్స్ పైన మూతలు విరిగిపోయి మద్యం నీళ్లలో కలిసిపోయింది. ఆ నీటిని తాగిన గేదెలు ఇక వింతగా ప్రవర్తించడం ప్రారంభించాయి.

ఇక రైతుల‌కి అస‌లు ఏమీ అర్దం కాలేదు. వెంట‌నే వాటిని వెట‌ర్న‌రీ వైద్య‌శాల‌కు తీసుకువెళ్లారు. రైతులు జ‌రిగింది ఏమిటో మొత్తం చెప్పారు. పొలాల వెంబడి కాలువల నీళ్లు తాగడం వల్లే ఇవి ఇలా ప్రవర్తిస్తున్నాయని తెలుసుకున్నాడు వైద్యుడు. చివ‌ర‌కు పోలీసుల‌కు ఈ విష‌యం చెప్పాడు, వెంట‌నే ముగ్గురు రైతుల‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. గేదెలు ప్ర‌స్తుతం కోలుకుంటున్నాయి.