Breaking News: ఏసీబీకి చిక్కిన ‘బుల్లెట్ బండి’ కాకా

0
104

కొన్ని రోజుల క్రితం ఓ వధువు ‘బుల్లెట్ బండి’ సాంగ్ కు చేసిన డ్యాన్స్ విపరీతంగా వైరల్ అయింది. ఆ పాటలో పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తుండగా పక్కనే ఉన్న ఆమె భర్త డ్యాన్స్ ను చూస్తూ ఉండిపోయాడు. అలా ఆ నవ వధువు చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. ఇక తాజాగా ఇప్పుడు ఆమె భర్త అశోక్ వార్తల్లోకి ఎక్కారు. బడంగ్ పెట్ మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారిగా పని చేస్తున్నాడు అశోక్. తన ఇంటికి పర్మిషన్ కావాలని యజమాని అశోక్ ను ఆశ్రయించాడు. అయితే ఇంటి పర్మిషన్ ఇవ్వాలంటే లంచం ఇవ్వాలని అశోక్ డిమాండ్ చేశాడు. దీనితో యజమాని ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.