ఇంత దారుణమా ఆడుకుంటున్న కుక్కలపై బైక్ పోనిచ్చిన కసాయి

The butcher who put the bike on the dogs

0
151

కొందరు వ్యక్తులు ఉంటారు ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తారు. సమాజంలో ఇలాంటి వారితో చాలా ప్రమాదం. వీరు చేసే పనులు ఎంతో క్రూరంగా ఉంటాయి. జంతువులని కూడా దారుణంగా హింసిస్తూ ఉంటారు. యూపీలో దారుణం జరిగింది, రోడ్డుపై ఆడుకుంటున్న కుక్కపిల్లని బైక్ తో గుద్ది కావాలనే చంపేశాడు దుర్మార్గుడు.

అయితే ఏదో పొరపాటుగా రోడ్డుపై గుద్దాడు ప్రమాదం జరిగింది అనడానికి లేదు. అతను ఉద్దేశపూరకంగా చేశాడు అనే తెలుస్తోంది. రోడ్డు మీద ఆడుకుంటున్న రెండు కుక్కపిల్లలను గుర్తుతెలియని వ్యక్తి బైకుతో తొక్కి చంపేశాడు. ఈ దారుణం ఆగ్రాలో జరిగింది.

ఆగ్రాలోని సికందరా ప్రాంతంలో జూన్ 14న రాత్రి 10.30 గంటలకు గుర్తుతెలియని వ్యక్తి రోడ్డుపై ఆడుకుంటున్న ఓ కుక్క పిల్ల మీదకు బైకు ఎక్కించాడు. వెంటనే అన్నీ కుక్కలు దగ్గరకు వచ్చాయి. ఈ సమయంలో మరోసారి వేగంగా బైక్ పై వచ్చి రెండోసారి కూడా వాటిపై బైక్ ఎక్కించాడు. ఇదంతా అక్కడ ఉన్న ఓ ఇంటి సీసీటీవీలో రికార్డు అయింది. అది కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జంతు ప్రేమికులు అతనిపై కేసు నమోదు చేశారు. అతను ఎవరు అనేది పోలీసులు బైక్ ద్వారా గుర్తుపట్టే పనిలో ఉన్నారు.