దారుణం..రాజ‌మండ్రిలో కసాయి తల్లి ఘాతుకం

The butcher's mother was killed in Rajahmundry

0
76

ఏపీ: ఇద్దరు పసి పిల్లలను ఉరివేసి హత్య చేసింది ఓ కసాయి తల్లి. ఈ విషాదకర ఘటన రాజమండ్రి ఆనంద్ నగర్ లో ఆదివారం రాత్రి జరిగింది. పూరేటి లక్ష్మీ అనూష అనే మహిళ తాడేపల్లికి చెందిన రామ్ లక్ష్మణతో వివాహం జరిగింది. ఆమె భర్త ఐదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండి రాజమండ్రి వచ్చి బ్యూటీషియన్ గా పనిచేస్తూ ఒకవైపు వడ్డీ వ్యాపారాలు నడుపుతోంది. ఏడాది క్రితం రామచంద్రాపురంకి చెందిన జొన్నలగడ్డ రామకృష్ణను మరో వివాహం చేసుకుంది.

రామకృష్ణ పోలవరంలో నివాసం ఉంటున్నాడు. గత కొద్ది కాలంగా సీతంపేటకు చెందిన సతీష్ అనే వ్యక్తితో సహజీవనం కొనసాగిస్తోంది. తరుచు పిల్లలను కుమార్తె చిన్మయి (8) , కుమారుడు మోహిత్ శ్రీ సత్య సాయిని (6) హింసలకు గురి చేస్తుండటంతో పిల్లల్ని కొట్టొద్దని అడ్డొచ్చిన తల్లి ముత్యం కనకదుర్గను గాయపరిచింది. దాంతో తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

ఈ ఘటనపై లక్ష్మి అనూష సోదరులు వారి మేనమామకు సమాచారం అందించడంతో వారు లక్ష్మీకి ఫోన్ చేసి మందలించారు. దాంతో ఇద్దరు పిల్లలను ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసి హత్య చేసి అనంతరం ఉరితాడును చాకుతో కోసి పిల్లలు మంచం మీద పడుకోబెట్టి ఆమె ప్రియుడు సతీష్, సోదరులకు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఫోన్ చేసింది. వారు ఆగమేఘాలపై ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడుతుండగా వారు లక్ష్మిని నిరోధించారు. అనంతరం పిల్లల్ని అనుష్కను 108 వాహనంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పిల్లలు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.