Breaking news: రేప్ కేసులో సీఐకి బిగుస్తున్న ఉచ్చు..ఫోరెన్సిక్ నివేదికలో సంచలన నిజాలు వెల్లడి

0
90

రేప్ కేసులో సస్పెండైన సీఐ నాగేశ్వరరావుకు ఉచ్చు బిగుస్తుంది. ఈ కేసుకు సంబంధించి నాగేశ్వరరావు పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించినట్టు సమాచారం.

ఇక తాజాగా డీఎన్ఏ శాంపిల్స్ మ్యాచ్ అయినట్టు ఫోరెన్సిక్ నివేదిక తేల్చింది. నాగేశ్వరరావు బెయిల్ పిటిషన్ పై ఎల్బీ నగర్ కోర్టులో విచారణ చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ సమయంలోనూ సాక్షుల్ని బెదిరించినట్లు తెలుతుంది. అయితే మాజీ సీఐ
నాగేశ్వరరావు ప్రవర్తనని కోర్టు దృష్టికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీసుకొచ్చారు.  ఒకవేళ ఆయనను బయటకు వదిలితే సాక్ష్యాలు తారుమారు చేసే ఛాన్స్ ఉంది. అలాగేబెయిల్ ఇస్తే బాధితులకు ప్రాణహాని ఉందని పీపీ చెప్పారు. నగరానికి దూరంగా ఉండేలా కండిషన్ తో నిందితుడి తరపు న్యాయవాది కోరారు. టాస్క్ ఫోర్స్, బంజారాహిల్స్ పీఎస్ లలో నాగేశ్వరరావు దందాలు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసును సెప్టెంబర్ 7వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.