సీఎంను కాల్చేస్తా..మాజీ ఎమ్మెల్యే భార్య సంచలన వ్యాఖ్యలు

0
75

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్‌ భార్య ఉషా జార్జ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తను సీఎం పినరయి విజయన్‌ వేధిస్తున్నారని, తుపాకీతో ముఖ్యమంత్రిని కాలుస్తానని ఆమె బహిరంగంగా బెదిరింపులు చేశారు.

‘‘ఇదొక తప్పుడు కేసు. కేరళ సీఎం నా భర్తను, కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నా భర్త చాలా అమాయకుడు. సీఎం అవినీతిని బయటపెట్టినందుకే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. మా నాన్న రివాల్వర్‌తో సీఎంను కాల్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను’’ అని ఉషా జార్జ్ హెచ్చరించారు.