మద్యం సేవించి జాబ్ కు వచ్చిందని ఉద్యోగం నుంచి కంపెనీ తొలగించింది – కాని కంపెనీకి షాకిచ్చిన కోర్టు

The company job removed for drunk in a job time

0
86

మనం ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నామంటే ఆ కంపెనీ ఇచ్చిన రూల్స్ పాటించాల్సిందే. ప్రపంచంలో ఎక్కడ చూసినా మద్యం తాగి ఆఫీసులకి వెళ్లకూడదు . ఇది ఇతరులకి ఇబ్బంది కంపెనీలో వర్క్ అవ్వదు. అందుకే ఇలా ఏ ఉద్యోగి మద్యం తాగి వచ్చినా కచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. అయితే ఇక్కడ కూడా ఇలాంటి ఘటన జరిగింది. కానీ కంపెనీకి ఊహించని ట్విస్ట్ జరిగింది.

స్కాట్లాండ్ లోని ఎడిన్ బ‌ర్గ్ లో మద్యం సేవించినందుకు ఒక మహిళా ఉద్యోగిని జాబ్ నుంచి తీసేశారు. కానీ ఈ విషయంలో తన తప్పు లేదని, అయినా కంపెనీ జాబ్ నుంచి తీసేశారని ఆ మహిళ కోర్టుకు వెళ్లింది. దీంతో ఆ కంపెనీ ఈ మహిళకు పరిహారం చెల్లించాల్సి వచ్చింది.

మాల్గోర్జాటా క్రోలిక్ అనే మహిళ ఓ కంపెనీలో పనిచేసేది. ఆమె ఆఫీసుకి వెళ్లిన సమయంలో ఆమె నుంచి మద్యం వాసన వచ్చింది. అయితే ఆమె మధ్యాహ్నం రెండు గంటల షిఫ్ట్ కి డ్యూటికి వెళ్లింది. కాని ఉదయం 5 గంటలకు మద్యం తీసుకుంది. దీంతో ఆ వాసన వచ్చింది. డ్యూటీ సమయంలో ఆమె మద్యం తాగలేదు అయినా కంపెనీ ఆమె మాట వినకుండా ఉద్యోగం నుంచి తీసేసింది.

తన వెర్షన్ చెప్పే అవకాశం కూడా కంపెనీ ఇవ్వలేదు. 11 ఏళ్లుగా ఆమె అక్కడ ఉద్యోగం చేస్తోంది. చివరకు కోర్టులో కేసు వేసింది. ఆ మహిళకు పరిహారంగా 5454 యూరోలు అంటే సుమారు రూ. 5 లక్షల 50 వేలు ఇవ్వాలని కోర్టు కంపెనీని ఆదేశించింది. కంపెనీ ఆ డబ్బు మొత్తం ఆమెకి అందచేసింది.