మొసలి దీనిని చూడగానే ఎవరైనా భయపడతారు. పదునైన దాని దవడలతో అమాంతం పట్టుకుంటుంది. జంతువులనే కాదు మనుషులని కూడా చంపిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నైలు నది మొసళ్లు మన ప్రపంచంలో డేంజర్. అయితే నదీ పరివాహక ప్రాంతాల్లో ఎన్నో జంతువులని, ప్రజలని చంపేశాయి.
అయితే తాజాగా ఓ మొసలిని పట్టుకున్నారు గ్రామస్తులు.ఇది మాములు మొసలి కాదు, ఏకంగా 80 మందిని పొట్టనపెట్టుకుంది. 14 ఏళ్లలో 80 మందిని పొట్టనపెట్టుకున్న మొసలిని ఎట్టకేలకు పట్టుకున్నారు. ఉగాండాలోని లూగంగ గ్రామంలోని ఒక చెరువులో ఇది ఉంటోంది. ఎవరైనా చెరువులోకి వస్తే ఇక అంతే దీనికి ఆహారం అయిపోతారు.
చాలా మంది తెలియక ఈ చెరువులో దిగి చనిపోయారు. గడిచిన 14 ఏళ్లలో 80 మంది దీని దాడిలో బలయ్యారు. దీనికి ఒసామా బిన్ లాడెన్ అని పేరుపెట్టారు. మొసలి వయసు 75 ఏళ్లు ఉంటుంది. 16 అడుగుల పొడవుతో ఇది ఉంటుంది. మొత్తానికి గ్రామస్తులు దీనిని పట్టుకుని అధికారులకి అప్పగించారు.