Breaking- రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సీరియల్​ నటి కూతురు మృతి

The daughter of a popular serial actress was killed in a road accident

0
74

కన్నడ బుల్లితెర నటి అమృతా నాయుడు కుమార్తె సమన్వీ(6) గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. టీవీ రియాలిటీ షో ‘నన్నమ్మ సూపర్​స్టార్’​లో​ చైల్డ్​​ కంటెస్టెంట్​గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది సమన్వీ..

బెంగళూరుకు చెందిన అమృత నాయుడు తన కుమార్తె సమన్విత గురువారం షాపింగ్ కి వెళ్ళింది. సాయంత్రం షాపింగ్ ముగించుకుని స్కూటీపై ఇంటికి బయలుదేరారు వారిద్దరు. నగరంలోని కొనంకుంటే క్రాస్ వద్ద ఆ వారి ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టింది. రోడ్డుపై పడిపోయిన సమన్వి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇక తీవ్రంగా గాయపడిన అమృత నాయుడు ఆస్పత్రికి తరలించారు స్థానికులు.