కూతురు మాట వినడంలేదని మనుషులు లేని దీవిలో వదిలారు తర్వాత ఏమైందంటే

స్కూలుకి వెళ్లడం లేద‌ని అందుకే పేరెంట్స్ ఈ నిర్ణయం

0
105

పిల్లలను కంట్రోల్ చేయడం ఒక్కోసారి తల్లిదండ్రులకి కష్టంగా మారుతుంది. అయితే వారిని ఏదో విధంగా లాలించి బుజ్జగించి కంట్రోల్ చేసుకోవాలి. అంతేకాని వారిని శిక్షిస్తే పరిస్దితి ఎలా ఉంటుంది. వారు మరింత పెంకిగా మన మాట వినని వారుగా తయారు అవుతారు. ముఖ్యంగా ఈ విషయంలో తల్లిదండ్రులకు ఎంతో ఓర్పు కావాలి.

ఈ తల్లిదండ్రులు ఓ దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. చెప్పిన మాట వినని మొండిగా వ్యవహరిస్తున్న తన కూతురిని మనుషులు నివసించని దీవిలో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. వినడానికే కాస్త భయంగా బాధగా ఉంది కదా. ఇది చైనాలో జరిగింది.షాన్డాంగ్ ప్రావీన్స్ సముద్ర జలాల్లో వేటకు వెళ్లిన జాలర్లకు సమీపంలోని దీవిలో 13 ఏళ్ల బాలిక ఒంట‌రిగా కనిపించింది.

వెంటనే వారు ఆమె దగ్గరకు వెళ్లి ఇక్కడకు ఎలా వచ్చావు అని అడిగితే, మా పేరెంట్స్ వదిలేశారు అని చెప్పింది. ఆమె స్కూలుకి వెళ్లడం లేద‌ని అందుకే పేరెంట్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట.
ఈ దీవిలో గత రెండు రోజులుగా చిమ్మచీకట్లో గడిపానని తెలిపింది. వెంటనే పోలీసులకి స‌మాచారం ఇచ్చారు. వారు ఆ దీవి దగ్గరకు వచ్చారు. ఆమెకి ఆహారం పెట్టి తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చారు. వెంటనే కుమార్తెని ఇంటికి తీసుకువెళ్లారు.