చదువుకోమన్నందుకు తల్లిని చంపిన కుమార్తె – ఎంత దారుణం

The daughter who killed the mother

0
77

ముంబైలో దారుణం జరిగింది. కూతురు బాగా చదువుకోవాలి అని ఆమె తల్లి కోరేది. అదే ఆమె పాలిట శాపం అయింది. చివరకు తల్లిని అత్యంత దారుణంగా చంపేసింది సొంత కుమార్తె.
జులై 27న ఆ అమ్మాయి ఫోన్ ఉపయోగించడం చూసి తండ్రి మందలించాడు. చివరకు ఇంట్లో వారిపై కోపంతో ఆమె మేనమామ ఇంటికి వెళ్లింది. ఇక తల్లి కూడా అక్కడకు వెళ్లింది. కుమార్తె ఇంట్లో నుంచి ఇలా రావడం పై ఆమె తిట్టింది. దీంతో ఈ గొడ‌వ‌ పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది.

చివరకు పోలీసులు ఇద్దరికి సర్దిచెప్పి పంపారు .ఇంటికి వచ్చిన తర్వాత కూడా తల్లి కూతురి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. జూలై 30న తండ్రి థాణే వెళ్లాడు. ఆ సమయంలో తల్లి పుస్తకాలు తీసి చదవాలంటూ ఒత్తిడి చేసింది . కుమార్తెని కత్తితో బెదిరించింది. దీంతో తల్లిని కుమార్తె వెన‌క్కి తోసేసింది. ఇక తల్లి మరింత కోపంతో ర‌గిలిపోయింది.

కరాటే డ్రెస్సుకు ఉండే బెల్టు తల్లికి దొరకడంతో దాంతో కుమార్తెను కొట్టేందుకు సిద్ధమైంది.
దీంతో ఆ అమ్మాయి తల్లి చేతిలోని బెల్టును లాక్కుని, ఆమె మెడ చుట్టూ బిగించి చంపేసింది. ఇక తల్లి ఇంటిలో రూమ్ లో నుంచి బయటకు రావడం లేదు అని ఇంట్లో బంధువులకి ఫోన్ చేసి చెప్పింది. వారు అందరూ వచ్చి చూసేసరికి అపస్మారక స్థితిలో పడిపోయిఉంది. వెంట‌నే ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు కాని చ‌నిపోయింద‌ని వైద్యులు తెలిపారు. విచార‌ణ‌లో త‌ల్లిని చంపాను అని కుమార్తె ఒప్పుకుంది.