తండ్రి మందలించాడని ఉరి వేసుకున్న కుమార్తె..

0
109

ఈ మధ్య కాలంలో చాలామంది చిన్న చిన్న కారణాలకు మనస్థాపానికి గురయ్యి తమ ప్రాణాలను తామే బలి తీసుకోవడానికి కూడా వెనుకాడడం లేరు. ఇప్పటికే ఇలా ఆత్మహత్య చేసుకొని మరణించిన ఘటనలు ఎన్నో చూసాము. తాజాగా విజయనగరం రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బీసీ కాలనీ శ్రీనివాస్‌నగర్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన  కుమార్తె శనివారం రోజు ఆత్మహత్య చేసుకుంది. ఆశపు కుమారస్వామి అనే వ్యక్తికి జ్ఞానప్రసూన అనే కూతురు ఉంది. తను ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతుండగా.. ప్రతిరోజు కళాశాల నుంచి ఆలస్యంగా ఇంటికి రావడంతో తండ్రి మందలించాడు. ఎందుకు ఆలస్యంగా వస్తున్నావు అని ప్రశ్నించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యి అందరు గాఢ నిద్రలో ఉన్న సమయంలో అర్ధరాత్రి ఫ్యాన్ కు ఉరి వేసుకుంది.

తెల్లవారుజామున కూతురు కనిపించకపోవడంతో దంపతులు ఆందోళనతో వెతుకుతుండగా జ్ఞాన ప్రసూన ఫ్యాన్ కు ఉరి వేసుకొని కనిపించింది. దాంతో దంపతులు కన్నీరు మున్నీరు చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.