ఏపీలోని తిరుమలలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. కళ్ల ముందే ఓ జింక ప్రాణాలు కోల్పోతూ బిడ్డకు జన్మనివ్వడం చూసి చుట్టుపక్కల వారు చలించిపోయారు. ఎట్టకేలకు ఈ ఘటనను టిటిడి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు భక్తులు.
తిరుమల కనుమ దారిలో ఓ జింకను బస్సు ఢీ కొట్టింది. దిగువ కనుమదారిలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద వేగంగా వస్తున్న బస్సు అటవీ ప్రాంతం నుంచి ఒక్కసారిగా అడ్డువచ్చిన జింకను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో జింక అక్కడికక్కడే మృతి చెెందింది. జింక చనిపోతూ ఓ బిడ్డకు జన్మనిచ్చింది.
ఈ సన్నివేశాన్ని చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. ఈ దృశ్యాన్ని చరవాణిలో వీక్షించిన ఎంపీ గురుమూర్తి చలించిపోయారు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా సంబంధిత అధికారులను సూచిస్తామని ఒక ప్రకటన ద్వారా తెలియజేసారు. ఘాట్ రోడ్డు లో వన్య ప్రాణుల సంరక్షణార్ధం భవిష్యత్తులో ఇలాంటి యాక్సిడెంట్లు పూనరావృతం కాకుండా తగు చర్యలు టీటీడీ తీసుకుంటుందని ఆశిస్తున్నాను.