బ్యూటీపార్లర్ కు వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అదృశ్యం..ఎన్నో అనుమానాలు

The disappearance of the software engineer who went to the beauty parlor..many suspicions

0
107

బ్యూటీపార్లర్ కు వెళ్లిన మహిళ అదృశ్యమైన ఘటన హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రేముమార్ తెలిపిన వివరాల మేరకు ..దోమలగూడ గగనహల్లో నివసించే జి  దుర్గాప్రసాద్, భార్గవి (26) భార్యాభర్తలు. భార్గవి నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తోంది. భార్గవి బుధవారం సాయంత్రం 5.30 సమయంలో సమీపంలోని బ్యూటీపార్లర్ కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది.

సాయంత్రం 6.30 కు భార్గవి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో దుర్గాప్రసాద్ బ్యూటీపార్లర్ కు వెళ్లి వాకబు చేశాడు. ఆమె అక్కడ లేకపోవడంతో బంధువులు, స్నేహితులను సంప్రదించాడు. ఫలితం లేకపోవడంతో దుర్గాప్రసాద్ చిక్కడపల్లి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని పలు ప్రాంతాల్లో ఆమె నడుచుకుంటూ వెళ్తున్న సీసీ టీవీ దృశ్యాలను గుర్తించారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వాలని ఎస్ఐ ప్రేమకుమార్ కోరారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.