రాయికి బదులు కిడ్నీ తొలగించిన డాక్టర్..ఎక్కడో తెలుసా?

The doctor who removed the kidney instead of the stone..do you know somewhere?

0
91

గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని ఓ ఆసుపత్రి వైద్యుడు చేసిన తప్పునకు..వినియోగదారుల ఫోరం కీలక తీర్పునిచ్చింది. వైద్యుని తప్పిదం వల్లే రోగి చనిపోయాడని నిర్ధారించి శస్త్రచికిత్సకు అయిన మొత్తం డబ్బులను వడ్డీ సహా తిరిగి చెల్లించాలని తీర్పు వెలువరించింది.

2011లో ఖేడా జిల్లాకు చెందిన దేవంద్రభాయ్ అనే వ్యక్తికి విపరీతంగా నడుం నొప్పి రావటం వల్ల వైద్యుడిని కలిశాడు. వైద్య పరీక్షలు చేసిన వైద్యుడు..కిడ్నీలో ఉన్న 14ఎంఎం రాయిని ఆపరేషన్‌ చేసి తొలగించాలని చెప్పాడు. 2011 సెప్టెంబర్ 3న ఆపరేషన్ చేసిన వైద్యుడు..రాయికి బదులు కిడ్నీ తొలగించాడు. రోగి ప్రాణం కాపాడటానికే మూత్రపిండం తొలగించినట్లు నమ్మబలికాడు.

ఆపరేషన్‌ అయిన 8 నెలలకే ఆరోగ్యం క్షీణించి బాధితుడు చనిపోయాడు. ఈ విషయమై మృతుడి కుటుంబీకులు..వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. శస్త్రచికిత్సకు అయిన 11 లక్షల 23 రూపాయలను 2011 నుంచి ఇప్పటివరకు ఏడున్నర శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది.