ఫిష్ వ్యాన్ బోల్తా, అరగంటలో చేపలు మాయం : మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే..?

0
105

రోడ్డుపై పోతున్న పచ్చి చేపల డిసిఎం బోల్తా పడ్డది. అందులో ఉన్న చేపలన్నీ రోడ్డు పక్కన పడ్డాయి. ఇంకేముంది… అటునుంచి ఇటునుంచి పోయే ప్యాసింజర్లు, సమీప గ్రామాల ప్రజలు ఎగబడ్డారు. అరగంటలో టన్ను చేపలు మాయమైపోయాయి. కానీ సీన్ కట్ చేస్తే… ఇక్కడ మైండ్ బ్లోయింగ్ అయ్యేలా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ వివరాలేంటో మీరే చదవండి.

హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవే పైన చౌటుప్పల్ సమీపంలోని అంకిరెడ్డిగూడెం స్టేజీ వద్ద బుధవారం ఉదయం పచ్చి చేపల లోడుతో వెళ్తున్న డిసిఎం టైర్ పంక్షర్ కావడంతో బోల్తా పడింది. ఈ లోడు కర్ణాటక లోని బీదర్ పట్టణానికి వెళ్తున్నది. రోడ్డు పక్కన పడి ఉన్న ఈ వాహనాన్ని వెనుక నుంచి ఒక కారు వచ్చి ఢీకొట్టింది. కానీ కారులో ఉన్నవారికి ఎవరికీ ఏమీ కాలేదు. వాళ్లంతా సేఫ్ గా ఉన్నారు.

ఇక చేపల బండి బోల్తా పడడంతో అందులోని సుమారు ఒక టన్ను వరకు చేపలు రోడ్డుపక్కన పడ్డాయి. ఇంకేముంది వచ్చిపోయే వాళ్లతోపాటు చుట్టుపక్కల గ్రామాల వాళ్లు ఆ చేపలు కొల్లగొట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఎవరికి దొరికినవి వారు తీసుకుని వెళ్లిపోయారు. ఆ వ్యాన్ లో ఉన్న చేపల్లో సుమారు టన్నుకు పైగా చేపలు రోడ్డు పక్కన పడితే, అవన్నీ అరగంటలో మాయం చేసేశారు. వాటిని కొట్టేసేందుకు పోటీ పడ్డారు.

ఈ హడావిడి కారణంగా రోడ్డుపై కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలు మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏమిటంటే… ఆ వ్యాన్ లో తరలిస్తున్నవి నిషేదిత క్యాట్ ఫిష్. క్యాట్ ఫిష్ అనేవి అత్యంత ప్రమాదకరమైనవి. వాటిని తింటే ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయని డాక్టర్లు చెబుతుంటారు. చెరువుల్లో ఒకవేళ క్యాట్ ఫిష్ కనబడితే ఎవరు వాటిని తినరు. కానీ ఇక్కడ జనాలు అవి క్యాట్ ఫిష్ అనే విషయం తెలియక ఎగబడి కొల్లగొట్టడం గమనార్హం.