కేరళలోని పొల్లాచ్చిలో ఓ పెట్రోల్ బంక్ అందులో 19 ఏళ్ల యువతి పనిచేస్తోంది. ఇక్కడకు రోజూ చాలా మంది కస్టమర్లు వచ్చి పెట్రోల్ పోయించుకుంటారు. అలా ఓ 17 ఏళ్ల కుర్రాడు కూడా ఇక్కడకు వచ్చేవాడు. ఆమెని రోజూ చూస్తు ఉండేవాడు. ఆమె కూడా అతనిని చూసేది. ఇద్దరూ ఒకరికి ఒకరు నచ్చారు. దీంతో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. రోజూ అతని కోసం పంపు దగ్గర ఉండేది.
ఈ మధ్య కుర్రాడికి అనారోగ్యం వచ్చి ఆస్పత్రిలో చేరాడు. అమ్మాయి ఆందోళన చెందింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లి చూసింది. అంతా బాగానే ఉంది తగ్గుతుంది అన్నాడు. ఇక ఇంటికి వచ్చాక మరోసారి అతనిని కలిసింది మనం పెళ్లి చేసుకుందాం, ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఎలాంటి అనారోగ్యం నీకు ఉండదని చెప్పి గుడిలో పెళ్లి చేసుకుంది.
ఇక ఇంట్లో వారికి ఈ విషయం తెలిసి ఆమెపై అతని పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. కుర్రాడికి 18 ఏళ్లు రాలేదు కాబట్టి అతను మైనర్. ఇలా మైనర్ను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం పోస్కో చట్టం ప్రకారం నేరం అని తెలిపారు. దీంతో ఆమెపై కేసు పెట్టి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకుముందు కోయంబత్తూరులో మైనర్గా ఉన్నప్పుడు మరో మైనర్ యువకుణ్ని ఇలాగే పెళ్లి చేసుకుందామని బలవంతం చేసిందట . అప్పుడు పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. కానీ ఇప్పుడు ఈ యువకుడిని ప్రేమించాను అతనికి 18 ఏళ్లు వచ్చాక వివాహం చేసుకుంటాను అంటోంది.