ఎంత దారుణం – అమ్మాయిని టూర్ కి తీసుకువెళ్లి అత్యాచారం -పక్కనే ఉన్నా ఆపని ఆమె ఫ్రెండ్

The girl was taken on tour and raped

0
115

ఈరోజుల్లో ఎవరిని నమ్మాలో అర్ధం కాని పరిస్దితి ఫ్రెండ్స్ కదా అనుకుంటే, వారే నమ్మిన వారి జీవితాలని నాశనం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లా మండూలో దారుణం జరిగింది. ఒకే కాలేజీలో చదువుకుంటున్న స్నేహితులు అందరూ కలిసి టూర్ కు వెళ్లారు.ఈ అమ్మాయిని వెంట తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి ఆమెపై ముగ్గురు అత్యాచారం చేశారు. దారుణం ఏమిటి అంటే, ఆమె స్నేహితురాలు పక్కన ఉన్నా వారిని వారించలేదు.

దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. పూజా నర్వారియా, ఆశిష్, నిపుల్, పునీత్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అస‌లు ఏం జ‌రిగింది అంటే ? ఇండోర్ లో డిగ్రీ చదువుతున్న బాధితురాలి దగ్గరకు పూజా వచ్చింది. ఆమెతో పాటు ఆశిష్, నిపుల్, పునీత్ అందరూ కలిసి మండూకు వెళ్దాము అన్నారు. అక్కడకు వెళ్లి తిరిగి సాయంత్రం పయనం అయ్యారు.

ఆ సమయంలో ఆశిష్ మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ను బాధితురాలికి ఇచ్చాడు. ఆ సమయంలో ఆమెని ఓ ఫ్లాట్ కి తీసుకువెళ్లారు. ఆమెపై ముగ్గురు అత్యాచారం చేశారు. అక్కడ ఉన్న పూజ చోద్యం చూస్తూ ఉండిపోయింది. ఈ సమయంలో వీడియో తీశారు ఈ విషయం బయట పెడితే చంపేస్తామని బెదిరించి తీవ్రంగా కొట్టారు. చివరకు ఆమె మరో ఫ్రెండ్ సాయంతో ఈ విషయం పోలీసులకి తెలిపింది.