భార్య ఎవరిని ప్రేమించిందో వారిని ఇంటికి తీసుకువచ్చిన భర్త – చివరకు ఏమైందంటే

ఆమెను అర్థం చేసుకుని లైఫ్లో గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.

0
109

పరాయి వ్యక్తుల మోజులో పడి కొందరు కాపురాలు నాశనం చేసుకుంటున్నారు. ఇదేదో ఒక్క చోట మాత్రమే జరుగుతుంది కాదు .చాలా చోట్ట ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా భార్య మరో మహిళను ప్రేమిస్తుందన్న విషయం తెలుసుకున్న వ్యక్తి ఏమి చేశాడో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. ఈ భర్త తన భార్య ద్విలింగ సంపర్కురాలని తెలియడంతో, ఆమెను అర్థం చేసుకుని లైఫ్లో గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చాడు.

తన భార్యను ప్రేమించిన అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చాడు. జస్టిన్ వృత్తిరీత్యా హాస్యనటుడు. కాటి రుప్పల్ రియల్ ఎస్టేట్ అసోసియేట్. వారిద్దరి మధ్య అనుకోకుండా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 2013లో పెళ్లి చేసుకున్నారు. ఓరోజు భార్య తన మనసులో సీక్రెట్ భర్తకు చెప్పింది. కాటి తాను ద్విలింగ సంపర్కురాలినని భర్తతో చెప్పింది. అంతేకాదు భర్త స్నేహితురాలు క్లైర్ను ఇష్టపడుతున్నట్లు వివరించింది.

సోషల్ మీడియా ఖాతాలో క్లైర్ను చూసి ఇష్టపడ్డాను అని చెప్పింది. దీంతో క్లైర్ని ఇంటికి ఆహ్వానించి ఈ విషయం గురించి డిస్కస్ చేశాడు జస్టిన్. ముందు ఈ మాట విని ఆమె షాక్ అయింది. అయినప్పటికీ కాటిని అర్థం చేసుకుని ఆమెతో బందాన్ని కొనసాగించేందుకు నిర్ణయించుకుంది. దీంతో ఒకే ఇంటిలో ముగ్గురు ఉంటున్నారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత రాలేదు.